నేటితో ప్రత్యేక పాలనకు తెర
● బాధ్యతలు స్వీకరించనున్న సర్పంచ్‌లు
● సుదీర్ఘ కాలం సాగిన
ప్రత్యేకాధికారుల పాలన
మోర్తాడ్(బాల్కొండ): సుదీర్ఘకాలం సాగిన ప్రత్యేకాధికారుల పాలనకు సోమవారంతో తెరపడనుంది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లు, వా ర్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 ఫిబ్రవరి 2 నుంచి సుమారు 22 నెలల 20 రోజులపాటు ప్ర త్యేకాధికారుల నేతృత్వంలో పంచాయతీల ఆలనా పాలన సాగింది. జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మూడు విడతల్లో పంచా యతీ ఎన్నికలను నిర్వహించినా అన్ని గ్రామాలలో ఒకేరోజు పదవీ బాధ్యతలను అప్పగించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇన్నాళ్లూ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించిన వారి నుంచి నూతన సర్పంచ్‌లు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నా రు. నేటి నుంచి ఐదేళ్లపాటు కొత్తగా ఎంపికై న స ర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవిలో కొనసాగనున్నారు.
ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్‌పై సందేహాలు..
పంచాయతీరాజ్ నిబంధనలను గత ప్రభుత్వం స డలించగా, వాటిని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పె ట్టింది. దీంతో కొత్తగా ఎంపికై న ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఉంటుందా? లేదా? అనే సందేహం నెల కొంది. ఉప సర్పంచ్‌కు చెక్‌పవర్ ఉంటుందనే ఆశ తో ఆ పదవిని దక్కించుకోవడానికి చాలా మంది పోటీపడి పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ప్రభు త్వం నిబంధనలను మార్చితే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ విషయంలో కొత్త మార్గదర్శకాలు వస్తేనే మార్పులకు అవకాశం ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు.


