నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Dec 22 2025 2:21 AM | Updated on Dec 22 2025 2:21 AM

నిజామ

నిజామాబాద్‌

న్యూస్‌రీల్‌

భార్యను హతమార్చిన భర్త

మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ ఘటన రెంజల్‌ మండలం బోర్గాంలో చోటు చేసుకుంది.

సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

– 8లో u

నేడు ప్రజావాణి

నిజామాబాద్‌అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమా న్ని ఈ నెల 22వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నా రు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్‌ తెలిపారు.

రిత్వికకు బంగారు పతకం

జాతీయ స్థాయి స్విమ్మింగ్‌

పోటీల్లో ప్రతిభ

నవీపేట: ఆలిండియా యూనివర్సిటీ నేషనల్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో నవీపేట మండలం బినోలాకు చెందిన మిట్టపల్లి రిత్విక ప్రతిభచాటింది. ఆదివారం జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఉన్న కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ టెక్నాలజీ యూనివర్సిటీ తరఫున రిత్విక ఈ పోటీలలో పాల్గొంది. 50 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌ విభాగంలో ఘనత సాధించింది. బంగారు పతకం సాధించిన రిత్వికను కళింగ యూనివర్సిటీ డైరెక్టర్‌ అచ్యుత సమంత, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌, తెలంగాణ స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చంద్ర శేఖర్‌రెడ్డి, ఉమేశ్‌, మహిపాల్‌రెడ్డి, జిల్లా ప్రతినిధులు గడీల రాములు, శ్రీనివాస్‌, శ్యాంసుందర్‌రెడ్డి, రాగిణి తదితరులు అభినందించినట్లు తండ్రి ప్రకాశ్‌రావ్‌ తెలిపారు.

ఫిబ్రవరి 22న

గురుకుల ప్రవేశ పరీక్ష

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): తెలంగాణ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష–2026ను ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించనున్నట్లు డీసీవో జి విజయలలిత ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగ తి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, మైనారిటీ రెసిడెన్షియల్‌ సంస్థల ఆధ్వర్యంలోని గురుకులాల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులకు 2026 జనవరి 21 చివరి తేదీ అని తెలిపారు. గురుకులాల్లో ఐఐటీ, నీట్‌, సీయూ, ఈటీ వంటి జాతీయస్థాయి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధన ప్ర కారం ప్రవేశాలు ఉంటాయని తెలిపారు.

వరి వైపే మొగ్గు

ఇందల్వాయి: వరి సాగు చేయడమే వ్యవసాయం అ నే పరిస్థితి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం సాగు విస్తీర్ణంలో 85శాతం వరి సాగవుతోంది. జిల్లా లో సుమారు 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా.. 4 లక్షల 30వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా విస్తారంగా వర్షాలు కురవడంతోపాటు సులభమైన సాగు విధానం, ప్రభుత్వ మద్దతు ధరకు తోడు బోనస్‌ డబ్బులు అందుతుండడం వరి సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతున్నాయి.

తాత్కాలిక లాభాలు.. దీర్ఘకాలిక నష్టాలు

పంట మార్పిడి విధానాన్ని అవలంబించకుండా కే వలం వరిని మాత్రమే సాగు చేస్తుండడంతో తాత్కాలిక లాభాల కన్నా దీర్ఘకాలిక నష్టాలే ఎక్కువని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏళ్ల తరబడి ఒకే రకం పంట సాగు చేస్తే చీడపీడల ఉధృతి పెరగడంతోపాటు విచ్చలవిడిగా మోతాదుకు మించి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడుతుండటంతో భూమి నిస్సారంగా మారుతుంది. పంటల సాగులో సమతుల్యత దెబ్బతిని ఇతర ఆహార, వాణిజ్య పంటల ధరలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వరి దిగుబడులు తగ్గడం, కూరగాయల ధరలు పెరగడమే ఈ పరిస్థితికి నిదర్శనం.

ప్రకృతి.. ప్రభుత్వాలపై పెనుభారం

అధిక విస్తీర్ణంలో వరి సాగుతో పెద్ద మొత్తంలో ప్ర మాదకర మిథేన్‌ వాయువు వాతావరణంలోకి కలుస్తుంది. ఇది కార్బన్‌ డై ఆకై ్సడ్‌ కన్నా 28 నుంచి 34 రెట్లు అధికంగా గ్లోబల్‌ వార్మింగ్‌కి కారణమవుతుంది. దీనికి తోడు విలువైన భూగర్భ జలాలు వేగంగా తరిగిపోతున్నాయి. ఉచితంగా విద్యుత్‌, రాయితీపై ఎరువులు తదితర కారణాలతో ప్రభుత్వాలపై రూ.వేల కోట్ల అదనపు భారం పడుతోంది. అధిక వరి సాగు కారణంగా జిల్లాలో 2019లో లక్షా ఇరవై ఒక్క వేల మెట్రిక్‌ టన్నుల యూరియా వాడకం జరిగితే 2025లో అది లక్షా నలభై వేల మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది. ధాన్యం కొనుగోళ్ల కోటా 54 లక్షల టన్నుల నుంచి 80 లక్షల టన్నులకు పెంచాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం.

రైతులను చైతన్యపర్చాలి

ప్రత్యేక రాయితీలు, ప్రోత్సా హకాలు ఇచ్చి జిల్లాలో అవ కాశం ఉన్న ప్రతి చోట ఆరుతడి పంటలు పండించేలా ప్రభుత్వం రైతులను చైతన్యపర్చాలి. అధిక వరి సాగు కారణంగా ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఉద్యాన, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా రైతులకు అవగాహన కల్పిస్తూ పంటల సమతుల్యత దెబ్బ తినకుండా జాగ్రత్తపడాలి.

– పీ తిరుపతిరెడ్డి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు

ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి

వరి సాగును తగ్గించేందుకు ప్రభుత్వం ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలి. సూక్ష్మ బిందు సేద్యం పరికరాల రాయితీకి నిధులు కేటాయించాలి. ఆరు తడి పంటలకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే సకాలంలో కొనుగోలు చేయాలి. కూరగాయలు పండించే రైతులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి. విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి.

– గడ్డం సతీశ్‌రెడ్డి, బండ దొన్కల్‌

మోర్తాడ్‌(బాల్కొండ): యాసంగి సీజన్‌లోనూ రైతు లు సన్నరకం వరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వడ్లు క్వింటాలుకు రూ.500 బోనస్‌ అందిస్తామని ప్రకటించడంతో దొ డ్డు రకాల స్థానంలో సన్నాలకే ప్రాధాన్యమిస్తున్నా రు. అయితే, గత యాసంగి సీజన్‌లో విక్రయించిన సన్నరకాలకు ప్రభుత్వం బోనస్‌ చెల్లించలేదు. కేవ లం వర్షాకాలం సీజన్‌ పంటకే బోనస్‌ను వర్తింపజేశారు. ఈసారి యాసంగిలో కొనుగోలు చేసే సన్నరకాలకు బోనస్‌ చెల్లిస్తారా లేదా అనే విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సన్న రకాలైన సూపర్‌ సీడ్‌, సూపర్‌ అమాన్‌, జై శ్రీరాం, కునారం రకాలను సాగు చేసేందుకు విత్తనాలను కొనుగోలు చేశారు. కొన్ని సీడ్‌ కంపెనీలు రైతులతో సన్నాలు, దొడ్డు రకాలను సాగు చేయిస్తున్నాయి. సీడ్‌ రకం సాగు చేస్తే రైతులకు మద్దతు ధర ఎక్కువగానే చెల్లిస్తున్నాయి. సన్నాలకు ప్రభుత్వం బోనస్‌ ఇస్తే అదనంగా మరో రూ.500 ప్రతి క్వింటాలుకు చెల్లిస్తామని ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నాయి. ప్రభుత్వం బోనస్‌ చెల్లించకపోతే కంపెనీలు ఒప్పందం ప్రకారం ధర చెల్లిస్తున్నాయి. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నా రు. అందులో 5 నుంచి 10 శాతం మాత్రమే దొడ్డు రకాలు, మిగిలిన మొత్తం సన్నరకాలు పండిస్తారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

యాసంగిలోనూ సన్నరకాలే..

సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్న రైతులు

బోనస్‌ చెల్లిస్తారనే నమ్మకంతో..

సన్నాల వైపే రైతు చూపు..

బోనస్‌ సంబరంతో రైతులు యాసంగిలోనూ సన్నరకాలను సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను తట్టుకునే సన్నరకం వరి విత్తనాన్ని కంపెనీలు అందుబాటులోకి తీసుకరావడంతో సన్నాల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు.

– వీరాస్వామి, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి

మొత్తం సాగు విస్తీర్ణంలో

85 శాతం వరి..

ఎక్కడా కనిపించని పంట మార్పిడి

ఒకే పంట సాగుతో దీర్ఘకాలిక

నష్టాలు ఎక్కువ

నిజామాబాద్‌1
1/3

నిజామాబాద్‌

నిజామాబాద్‌2
2/3

నిజామాబాద్‌

నిజామాబాద్‌3
3/3

నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement