
పట్టణంలో కోతులు.. ప్రజలకు తిప్పలు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో రోజురోజుకు కోతుల బెడద అధికమవుతోంది. పలు వార్డుల్లో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇళ్లలోకి వచ్చి ప్ర జలపై దాడి చేస్తున్నాయి. ఇల్లంతా చిందర వందర చేస్తున్నాయి. మున్సిపల్ అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు కోతుల సమస్య గురించి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కోతులతో పాటు కు క్కలు కూడా కాలనీలో సైర్వ విహారం చేస్తున్నాయి. కోతుల దెబ్బకు ఇళ్ల తలుపులు ఎప్పుడూ వేసుకోవాల్సి వస్తోంది. పట్టణంలోని 36, 11, 29, 32, 33, 13వ వార్డుల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది.
కాలనీల్లో గుంపులుగా సంచారం
బయటకు వెళ్లాలంటే జంకుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు