చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

May 24 2025 1:10 AM | Updated on May 24 2025 1:10 AM

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

పెర్కిట్‌(ఆర్మూర్‌): యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జాతీయ అవార్డు గ్రహీత, ఆర్మూర్‌ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు పట్వారీ తులసి కుమార్‌ హితవు పలికారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లిలో శుక్రవారం ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక వ్యవస్థాపకుడు కోటపాటి నర్సింహ నాయుడితో కలిసి తులసి కుమార్‌ డ్రగ్స్‌ నియంత్రణ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తులసి కుమార్‌ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలై ఉజ్వలమైన భవిష్యతును నాశనం చేసుకోవద్దని సూచించారు. నేతలు రుక్మాజి, సురేష్‌, నరేష్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement