
నాణ్యమైన విత్తనాలను వినియోగించాలి
మోర్తాడ్: పంటల సాగులో నాణ్యమైన విత్తనాలనే వినియోగించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్‌రెడ్డి రైతులకు సూచించారు. తమ సంస్థ ఉత్పత్తి చేసిన విత్తనాలను వినియోగిస్తే ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. మంగళవారం భీమ్‌గల్ మండలం ముచ్కూర్‌లో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంటల సాగులో రసాయనాలను వినియోగించే విధానానికి స్వస్తి పలకాలని సూచించారు.
భూసారం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో తప్పకుండా రసీదు తీసుకోవాలని, అనేక ప్రైవేట్ కంపెనీలు రైతులకు నాణ్యత లేని విత్తనాలను అంటగట్టి నట్టేటా ముంచుతున్నాయని ఆరోపించారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను స్వీకరించి పంటల సాగు లో మెరుగైన విధానాలను అవలంబించాలని కోరారు. కార్యక్రమంలో జేడీఏ సాయికృష్ణ, ఏవో లావణ్య, శాస్త్రవేత్తలు శ్రీలత, దినేశ్, కాంగ్రెస్ నాయకులు బొదిరె స్వామి, కుంట రమేశ్, కన్నె సురేందర్, కొరడి రాజు, అనంతరావు, బంగ్లా దేవేందర్, గంగారెడ్డి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి..
మోపాల్(నిజామాబాద్‌రూరల్): వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను పాటించి లాభాలు గడించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ రైతులకు సూచించారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలోభాగంగా రుద్రూర్ చెరుకు, వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు మంగళవారం మండలంలోని సిర్‌పూర్‌లో అవగాహనాసదస్సు నిర్వహించారు. ఏవో సౌమ్య, శాస్త్రవేత్తలు సౌందర్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ కె వెంకట్‌రెడ్డి రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.