
బాలల ప్రతిభ అద్భుతం
నిజామాబాద్ రూరల్: తల్లిదండ్రులు తమ పిల్లలలోని సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ పేర్కొన్నారు. బాలభవన్ వేసవి శిక్షణ శిబిరంలో పిల్లల ప్రతిభా పాటవ ప్రదర్శనకు డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా బాలభవన్ రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. అనంతరం పిల్లలు ‘గోవింద, గోవింద గోవింద అనరే...అన్నమాచార్య కీర్తనపై చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జాదు యుగంధర్ రంగనాథ్ చేసిన ఇంద్రజాల విన్యాసాలు అబ్బురపరిచాయి. కార్యక్రమంలో మనోరమ ఆస్పత్రి నిర్వాహకులు డా.హనీశ్ శశిధర్ దేశ్‌పాండే, బాలభవన్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మల్లాది ఉమాబాల, ప్రత్యేకాధికారి విఠల్‌ప్రభాకర్, వెంకటలక్ష్మి, పుష్పలత, నటరాజ్, లక్ష్మణ్, రాంచందర్, గణేశ్, విజయ, గణేశ్, శ్రీలత, సోనాలి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

బాలల ప్రతిభ అద్భుతం