బోధన్: పట్టణంలో ఈనెల 30న అంబేడ్కర్, జ్యోతిబాపూలే, జగ్జీవన్‌రాం జయంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న మహనీయుల జయంత్యోత్సవ సభ, ర్యాలీకి ప్రజలు తరలిరావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ప్రతినిధి పరిమి కోటేశ్వర్‌రావు కోరారు. బోధన్‌లోని తాలూకా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవన్‌లో ఆదివారం డివిజన్ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా వేలాది మందితో ర్యాలీ నిర్వహించనున్నామని, సభను అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. కమిటీ కన్వీనర్ నీరడి ఈశ్వర్, ప్రతినిధులు రవి కుమార్, వెంకటి, సింగాడి పాండు, సూర్యకాంత్, దేవేందర్, కారం స్వామి, రాహుల్, సురేందర్ పాల్గొన్నారు.
ఐకమత్యంతో
ముందుకు సాగాలి
నిజామాబాద్ రూరల్: బ్రాహ్మణులు ఐకమత్యంతో ముందుకు సాగాలని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య శాశ్వత చైర్మన్ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ పేర్కొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం జిల్లా కేంద్రంలోని అర్వపల్లి పురుషోత్తం గుప్త కల్యాణ మండపంలో నిర్వహించారు. రాష్ట్రంలో పరిషత్ ద్వారా వచ్చే నిధులు త్వరలోనే విడుదలవుతాయని తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న పేద బ్రాహ్మణులకు, పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికై న రాష్ట్ర శాశ్వత చైర్మన్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఉమాకాంత్, డాక్టర్ చంద్రశేఖర్ బిర్లా రామారావు, భూపతి రావు, ప్రవీణ్ కులకర్ణి, గాయత్రి కులకర్ణి, శరత్ కుమార్, వైద్య రణధీర్, ప్రవీణ్ మహరాజ్, రాజగోపాల చారి, రామ్ శ్యామ్, నవీన్, విజయ్, సభ్యులు పాల్గొన్నారు.
నేత్ర, శరీర అవయవ దాతల సంఘం కన్వీనర్‌గా ప్రేమ్‌లాల్
నిజామాబాద్ రూరల్: తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం నిజామాబాద్ సిటీ కన్వీనర్‌గా బానోత్ ప్రేమ్‌లాల్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామిడి సతీశ్‌రెడ్డి ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు.
‘జయంత్యోత్సవాలకు తరలిరావాలి’
‘జయంత్యోత్సవాలకు తరలిరావాలి’