
ముగిసిన అఖండ శివనామ సప్తాహం
బోధన్: పట్టణంలోని ఏకచక్రేశ్వరాలయంలో ఈనెల 20న ప్రారంభమైన అఖండ శివనామ సప్తాహం ఆదివారం సాయంత్రం ముగిసింది. ఏడు రోజుల పాటు ఆలయంలో ఉదయం 5గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శివనామ సంకీర్తన, భజనలు, పరమ రహస్య గ్రంథ సామూహిక పారాయణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. మహారాష్ట్ర ప్రాంత బేట్‌మోగ్రా వీరశైవ మఠాధిపతి సద్గురు సిద్ధ దయాళ్ శివాచార్య మహారాజ్ సప్తాహం ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఆధ్యాత్మిక అంశాలపై ప్రవచనాలు చేశారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని శనివారం రాత్రి సామూహిక ఇష్టలింగ అభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహారాష్ట్ర ప్రాంతం లాతూర్ జిల్లాకు చెందిన మహిళ భజన కళాకారులు, గాయకులు ఆటపాటలతో శివనామ స్మరణ గేయాలు ఆలపించి ఆకట్టుకున్నారు. వీరశైవ సమాజ్ గురువులు, సభ్యులు పాల్గొన్నారు.

ముగిసిన అఖండ శివనామ సప్తాహం