
డీఏవోకు డీడీఏగా పదోన్నతి
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా వ్యవసాయాధి కారి వాజిద్ హుస్సేన్ కు డీడీఏగా పదోన్నతి లభించింది. జిల్లాలో నే రైతు శిక్షణ కేంద్రం ఉప సంచాలకులుగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి స్థానంతోపాటు జిల్లా వ్యవసాయాధికారిగా ఈయనే కొనసాగనున్నారు. ఈ సందర్భంగా శాఖ ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే వాజిద్ హుస్సేన్ ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు.
భారత్ సమ్మిట్‌లో
జిల్లా కాంగ్రెస్ నేతలు
నిజామాబాద్ సిటీ: హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీ శనివారం ము ఖ్య అతిథిగా హాజరైన సమ్మిట్‌లో బోధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు.
పది తర్వాత పని వద్దు
● ఎండల తీవ్రతతో మారిన
‘ఉపాధి’ పని వేళలు
డొంకేశ్వర్(ఆర్మూర్): తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా ఉపాధిహామీ పని వేళలు మారాయి. కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 10గంటల తర్వా త పనులు చేయించొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆదేశాలందుకున్న అధికారులు ఏపీవోలు, ఫీల్ట్ అసిస్టెంట్లకు సూచనలు జారీ చేశారు. ఉదయం ఆరు గంటలకే కూలీలు పనికి వచ్చేలా చూడాలని, పనిచేసే చోట నీడ, నీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్ల సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 530 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. చెరువుల్లో నీళ్లు తగ్గడంతో గుంతలు తవ్విస్తున్నారు. రోజుకు 30వేల మందికి పైగా కూలీలు పనులకు వస్తున్నారు. ప్ర స్తుతం ఎండలు రికార్డు స్థాయిలో మండుతున్నాయి. ఎండల తీవ్రత తగ్గే వరకు ఉద యం 6 నుంచి 10 గంటల వరకే ఉపాధిహా మీ పనులు చేపట్టాలని ఆదేశాలు వచ్చినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ ‘సాక్షి’కి తెలిపారు.

డీఏవోకు డీడీఏగా పదోన్నతి