కుక్కల దాడిలో 20గొర్రెలు మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో 20గొర్రెలు మృత్యువాత

Apr 27 2025 12:36 AM | Updated on Apr 27 2025 12:36 AM

కుక్క

కుక్కల దాడిలో 20గొర్రెలు మృత్యువాత

ఎల్లారెడ్డిరూరల్‌: మండలంలోని మల్లయ్యపల్లి గ్రామంలో కుక్కలు దాడి చేయడంతో 20 గొర్రెలు మృత్యువాత పడినట్లు గ్రామస్తులు శనివారం తెలిపారు. గ్రామంలోని కుర్మ మహేందర్‌కు చెందిన గొర్రెలపై కుక్కలు అకస్మాత్తుగా దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయని అన్నారు. మృతి చెందిన గొర్రెలను వెటర్నరీ వైద్యురాలు అర్చన పరిశీలించారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించేలా చూడాలని బాధితుడు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ చర్యలు తీసుకుంటారని మండల పార్టీ అధ్యక్షుడు సాయిబాబా బాధితుడికి హామీ ఇచ్చారు.

విద్యుత్‌ షాక్‌తో గేదె..

రుద్రూర్‌: మండలంలోని రాణంపల్లి శివారులో విద్యుత్‌ షాక్‌ తగిలి పాడి గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ గేదెల పెంపకం ప్రధాన వృత్తిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. శనివారం గేదెలను మేత కోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లగా ఒక గేదె ట్రాన్స్‌పార్మర్‌ వద్ద విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. మృతి చెందిన గేదె రూ.లక్షా 25వేల వరకు ఉంటుందని, నష్ట పరిహరం ఇప్పించాల్సిందిగా బాధిత రైతు కోరాడు.

మహిళ అదృశ్యం

రుద్రూర్‌: కోటగిరి మండలం వల్లాభాపూర్‌ గ్రామానికి చెందిన మేకల లక్ష్మి అదృశ్యమైనట్టు ఎస్సై సునీల్‌ శనివారం తెలిపారు. ఈ నెల 17న ఇంట్లోంచి వెళ్లిన లక్ష్మి ఇప్పటి వరకు తిరిగి రాలేదు.బంధువులు,స్నేహితుల వద్ద వెతికినప్పటికీ ఆమె ఆ చూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త శివరాములు శనివారం పోలీస్‌స్టేషన్‌ ఫిర్యా దు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

ఇసుక టిప్పర్లు సీజ్‌

నిజాంసాగర్‌(జుక్కల్‌): కర్ణాటక రాష్ట్రానికి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను శనివారం సీజ్‌ చేసినట్లు డోంగ్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సాయిబాబా తెలిపారు. డోంగ్లి మండలంలోని మంజీరా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో పట్టుకున్నామన్నారు.

కుక్కల దాడిలో 20గొర్రెలు మృత్యువాత
1
1/2

కుక్కల దాడిలో 20గొర్రెలు మృత్యువాత

కుక్కల దాడిలో 20గొర్రెలు మృత్యువాత
2
2/2

కుక్కల దాడిలో 20గొర్రెలు మృత్యువాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement