
వక్ఫ్‌బోర్డు సవరణపై సుప్రీంలో పిటిషన్ వేశా
నిజామాబాద్ సిటీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ ముస్లిం సమాజాన్ని బలహీనపర్చే కుట్ర పన్నారని, అందులో భాగమే వక్ఫ్ బోర్డ్ స వరణ అని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సల హాదారు మహ్మద్ అలీ షబ్బీర్ విమర్శించారు. బీజే పీ ప్రభుత్వ చర్యను ముస్లిం సమాజం తీవ్రంగా వ్య తిరేకిస్తోందన్నారు. వక్ఫ్‌బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న అ నంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డు ఆ స్తులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవా లని చూస్తోందని, వక్ఫ్‌బోర్డు చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్‌బిల్లును అమలు కానివ్వబోమని, చట్ట ప్రకారం కోర్టుల ద్వారా అడ్డుకుంటామన్నారు. రాహుల్‌గాంధీ ఆదేశాలతో తాను సుప్రీంకోర్టులో పిటిషన్ దా ఖలు చేశానని, దానిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిందని తెలిపారు. ఈ కేసును సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్ బృందం వాదిస్తోందన్నారు.
ముస్లిం సమాజాన్ని బలహీనపర్చే కుట్ర
ప్రభుత్వ సలహాదారు
మహ్మద్ అలీ షబ్బీర్

వక్ఫ్‌బోర్డు సవరణపై సుప్రీంలో పిటిషన్ వేశా