ఆర్మూర్‌లో పోలీసుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌లో పోలీసుల తనిఖీలు

Apr 18 2025 1:48 AM | Updated on Apr 18 2025 1:48 AM

ఆర్మూర్‌లో పోలీసుల తనిఖీలు

ఆర్మూర్‌లో పోలీసుల తనిఖీలు

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలో గురువారం నిషేధిత మ త్తు పదార్ధాలు, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గు ర్తించేందుకు శిక్షణ పొందిన డాగ్‌స్వ్కాడ్‌ ద్వారా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌తోపాటు హోటల్స్‌, దుకాణాలను సిబ్బంది తనిఖీ చేశారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ మాట్లా డుతూ.. ఎవరైన నిషేధిత మత్తు పదార్థలు వాడితే చర్యలు తప్పన్నారు. పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌గా సుమన్‌

నిజామాబాద్‌ అర్బన్‌: ఎంప్లాయీస్‌ జేఏసీ జిల్లా చైర్మన్‌ సుమన్‌ నియమితులయ్యారు. నగరంలోని టీఎన్జీవోఎస్‌ కార్యాలయంలో గురువారం తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్‌ అధికారుల జాయింట్‌ యాక్షన్‌కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంప్లాయీస్‌ జేఏసీ జిల్లా చైర్మన్‌గా సుమన్‌ను సభ్యులు ఎన్నుకున్నారు.

ఫోన్‌ కొడితే ఆర్టీసీ బస్సుల సమాచారం

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌లోని బస్సు వేళల వివరాల కోసం ప్రయాణికులు ఫోన్‌ కొడితే సమాచారం అందించనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఎం కోరారు. రీజియన్‌ పరిధిలోని నిజామాబా ద్‌, ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ, కామారెడ్డి డిపో ల పరిధిలో సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు ఇలా..

ఆర్మూర్‌–73828 43133

బోధన్‌–98495 00725

నిజామాబాద్‌–99592 26022

బాన్సువాడ–94911 05706

కామారెడ్డి–73828 43747

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement