
రాజకీయ ప్రతినిధులతో సమావేశం
నిజామాబాద్ సిటీ: నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నా యకులతో బుధవారం కమిషనర్ దిలీప్‌కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారీ, జాబితాలో తప్పుల సవరణలు వంటి అంశాలపై చర్చించారు. స మావేశంలో మున్సిపల్ అధికారులు, పార్టీల నాయకులు షకీల్ అహ్మద్ పాల్గొన్నారు.
వీహెచ్‌పీ ప్రచార రథాలు ప్రారంభం
నిజామాబాద్ రూరల్: వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర కోసం తయారు చేసిన ప్రచార రథాలను నగరంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ గౌడ్ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర టోలి సభ్యులు ప్రసాద్ జి, ఏబీవీపీ రాజ్ సాగర్ జి, నవీన్, ఆర్య సమాజ్ రాజేశ్వర్, ఇందూర్ విభాగ్ ప్రముఖ్ తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు దినేశ్ ఠాకూర్ , కార్యదర్శి గాజుల దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి
డిచ్‌పల్లి: బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకు డు జెట్లింగ్ ఎల్లోసా సూచించారు. సుద్దపల్లి గ్రామంలో తెయూ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ –1, యూనిట్–4ల సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేసవికాల ప్రత్యేక శిబిరంలో బుధవారం ఆన్‌లైన్ బెట్టింగ్‌తో నష్టాలపై ఆయన అవగాహన కల్పించారు. తెలంగాణ గేమింగ్ నిరోధక చట్టం 1974పై వివరించారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి హెడ్‌కానిస్టేబుల్ ఏవీ రమణ సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్లు స్వప్న, స్రవంతి, పంచాయతీ కార్యదర్శి కవిత, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ ప్రతినిధులతో సమావేశం