సుదర్శన్‌రెడ్డి వైపే సీఎం మొగ్గు | - | Sakshi
Sakshi News home page

సుదర్శన్‌రెడ్డి వైపే సీఎం మొగ్గు

Mar 26 2025 1:15 AM | Updated on Mar 26 2025 1:13 AM

మాజీ మంత్రి, బోధన్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్‌ నేత పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే వార్తలు వస్తున్నాయి. పీసీసీ సర్కిళ్లతో పాటు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సుదర్శన్‌రెడ్డికి కచ్చితంగా బెర్త్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుదర్శన్‌రెడ్డి అన్నీ తానై జిల్లాలో అన్ని వ్యవహారాలను సమీక్ష చేస్తూ చక్కబెడుతూ వస్తున్నారు. షబ్బీర్‌అలీ ఎమ్మెల్సీ పదవి, తద్వారా మైనారిటీ కోటాలో కేబినెట్‌ పదవి ఆశిం నప్పటికీ పార్టీ నాయకత్వం అవకాశం ఇవ్వలేదు. సుదర్శన్‌రెడ్డిని తన కేబినెట్‌లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం గట్టి పట్టుదలతో ఉన్నారు. పార్టీ నాయకత్వం మరో ఆలోచన చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్‌ మాత్రం కచ్చితంగా సుదర్శన్‌రెడ్డికి బెర్త్‌ కేటాయించేందుకు అధిష్టానంపై ఒత్తిడి పెడుతున్నారు. దీంతో సుదర్శన్‌రెడ్డికి బెర్త్‌ ఖాయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement