టమాట సాగు వైపే మొగ్గు! | - | Sakshi
Sakshi News home page

టమాట సాగు వైపే మొగ్గు!

Mar 26 2025 1:15 AM | Updated on Mar 26 2025 1:13 AM

బాల్కొండ: వేసవిలో టమాట సాగు ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది సైతం అన్నదాతలు టమాట సాగువైపే మొగ్గు చూపారు. టమాటకు మంచి ధర దక్కుతుందని ఆశతో సాగు చేపట్టారు. గత మూడు సంవత్సరాల క్రితం వేసవి సీజన్‌లో 25 కిలోల టమాట బాక్స్‌ ధర రూ.3 వేల వరకు పలికింది. దీంతో ఏదో ఒక సమయంలో ధర వస్తుందనే ఆశతో ఏటా టమాట పంటను సాగు చేస్తున్నారు. స్వల్పకాలిక పంట కావడంతో ప్రస్తుతం పసుపు పంట తవ్విన నేలలో అధికంగా టమాటను సాగు చేశారు. మరో పక్షం రోజుల్లో కాత ప్రారంభమవుతుంది. ప్రస్తుతం టమాట ధర అంతగా లేకున్నప్పటికీ కాత ప్రారంభమయ్యే వరకు ధర పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉద్యానశాఖ అధికారులు వివరించాలని రైతులు కోరుతున్నారు.

ధర దక్కుతుందని అన్నదాతల ఆశ

ప్రతి ఏడాది వేసవిలో పెరుగుతున్న సాగు

ధర పలుకుతుందని..

ఈ సీజన్‌లో మంచి ధర వ స్తుందని ఆశతో ఎకరం భూమిలో టమాట సాగు చేశాను. మదనపల్లి టమాట వేసవిలో మన వైపు రాదు. అందుకే ధర ఉంటుందని పంటను సాగు చేశాం. మంచి ధర రావాలని కోరుకుంటున్నాం. – కొత్తపల్లి దేవేందర్‌, రైతు

టమాట సాగు వైపే మొగ్గు! 1
1/1

టమాట సాగు వైపే మొగ్గు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement