నిజామాబాద్‌అర్బన్: జిల్లా విద్యాశాఖలో ‘శాస్త్రవేత్తతో ఒక రోజు’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు దగ్గరలోని రీసెర్చ్ ల్యాబ్, ప్లానిటోరియం, స్పేస్ సెంటర్, ఐఐటీ వంటి సంస్థలను సందర్శించి అనుభవాలు నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా సైంటిస్ట్‌ను ఒక రోజు వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేయాలి. క్విజ్ పోటీలు, డిబెట్, పోస్టర్‌మేకింగ్ తదితర అంశాలు నిర్వహించాలి. 6 నుంచి 9వ తరగతి వరకు మే 5వ తేదీలోగా కార్యక్రమాన్ని నిర్వహించి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ శిక్షణ వారికి వివరాలు పంపించాల్సి ఉంటుంది.
ఘనంగా
గోటి తలంబ్రాల దీక్ష
నిజామాబాద్ రూరల్: శ్రీరామనవమి రోజు న కనులపండువగా జరిగే భద్రాచల రామ య్య కళ్యాణానికి తెలంగాణ నుంచి 250 కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్పంతో శ్రీరామకోటి భక్త సమాజం ధార్మి క సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని కోటగల్లి లో ఉన్న జైర్‌కోట్ హనుమాన్ మందిరంలో మంగళవారం వంద మందికిపైగా భక్తులు రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఒ లిచి సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు కు అందజేశారు. మైసమ్మ, జైర్‌కోట్, మల్లికార్జున, విజయగణపతి భజన మండళ్ల ఆ ధ్వర్యంలో నాలుగు గంటలపాటు భజన కొ నసాగింది. రామకోటి రామరాజును భక్తులు సన్మానించారు. తాము భద్రాచలం వెళ్లలేకపోయినా.. తమ చేతులతో ఒలిచిన గోటి తలంబ్రాలు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు ఇరిగేషన్‌లో పదోన్నతులు
నిజామాబాద్‌నాగారం: ఇరిగేషన్‌లో ఎట్టకేలకు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశారు. ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా, అధికారులు జాప్యం చేస్తున్న వైనాన్ని ఎత్తిచూపుతూ ‘ఇరిగేషన్‌లో పదోన్నతుల లొల్లి’ శీర్షికన జనవరి 8న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి శాఖ అధికారులు స్పందించారు. పదోన్నతుల ప్రక్రియకు ఎవరు అడ్డుపడుతున్నారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మండిపడినట్లు తెలి సింది. యూనియన్ నాయకులు తమకు సంబంధించిన వ్యక్తులను ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చేందుకు పదోన్నతులకు అడ్డుప డ్డారని ఉద్యోగులు చర్చించుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఐక్యంగా నిరసన తెలిపేందుకు సిద్ధం కా వడంతో ఫైల్‌ముందుకు కదిలింది. ఎట్టకేల కు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్‌లకు సీనియ ర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి లభించింది.
ఆ పోస్టుల సంగతేమిటో?
ఇద్దరు జూనియర్ అసిస్టెంట్‌లకు పదోన్నతు లు రావడంతో 2పోస్టులు ఖాళీ అయ్యాయి. వాటితోపాటు దఫేదార్(సీనియర్ అటెండ ర్) 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 4 పోస్టులకు సంబంధించి పదోన్నతులను పెండింగ్‌లోనే ఉంచారు. వీటితోపాటు ఆరు కారుణ్య నియామకాలు చేపట్టాల్సి ఉంది. కొంతమంది ముడుపులు ఇస్తేనే పదోన్నతులు ప్రక్రియను పూర్తి చేస్తున్నారని, లేకుంటే నెలల తరబడి ఆలస్యం చేస్తున్నారని శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
క్యాన్సర్ బాధిత బాలుడికి
తోటి విద్యార్థుల చేయూత
డొంకేశ్వర్(ఆర్మూర్): లుకేమియా (బ్లడ్ క్యా న్సర్)తో బాధపడుతున్న బాలుడు నిర్విన్ తేజ్ వైద్యం కోసం తొండాకూర్ ఎస్‌ఎస్‌వీ పాఠశాల విద్యార్థులు విరాళాలు సేకరించా రు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు కూడా విరాళాలు ఇ చ్చారు. మొత్తం రూ.2లక్షల వరకు సమకూరగా, డబ్బులను నిర్విన్ తేజ్ కుటుంబ స భ్యులకు అందజేసినట్లు పాఠశాల కరస్పాండెంట్ చిరంజీవి మంగళవారం తెలిపారు. అదేవిధంగా ఎంఎస్‌ఆర్ ఫౌండేషన్ తరపున రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
విద్యాశాఖలో శాస్త్రవేత్తతో ఒకరోజు