మోర్తాడ్/కమ్మర్‌పల్లి/డిచ్‌పల్లి: రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు మరో సత్యాగ్రహ పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏర్గట్ల, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, డిచ్‌పల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన సమావేశాల్లో బల్మూరి వెంకట్ పాల్గొని మాట్లాడారు.
గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, జాతిపిత మహాత్మాగాంధీపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునివ్వడంతో ప్రజలు ఉమ్మడిగా మరో సత్యాగ్రహాన్ని చేయాలన్నారు. ఈమేరకు ఈనెల 27నుంచి గ్రామాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మైనింగ్ కార్పొరేషన్ ౖచైర్మన్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల అసోసియేషన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్‌రెడ్డి, నాయకులు అమృతాపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
పలు మండలాల్లో జై బాపు, జై భీం,
జై సంవిధాన్ సమావేశాల నిర్వహణ