డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): అకాల వర్షాలు, వడగళ్ల వానలకు సుమారు వేయి ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని, బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం ఆయన మా ట్లాడారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఎకరానికి రూ.10వేలు చొప్పున పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరగా.. సానుకూలంగా స్పందించిన సీఎం, మంత్రికి ధన్యవాదాలు తెలుపు తున్నామన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా పసుపు, ఎర్రజొన్నల రైతులపై, మంచిప్ప ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. గతంలో జిల్లాకు వచ్చిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి సైతం కేసులు ఎత్తి వేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రూరల్ నియోజకవర్గంలో 400 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నందున జిల్లాకు నూతనంగా వ్యవసాయ యూనివర్సిటీ లేదా వ్యవసాయ కళాశాల మంజూరు చేయాలని భూపతిరెడ్డి కోరారు.
బెట్టింగ్ యాప్‌ల ఓనర్లపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ సిటీ: బెట్టింగ్‌యాప్‌ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవా రం ఆయన మాట్లాడారు. అనేక మంది మధ్యతరగతి యువత తమకు తెలియకుండానే బెట్టింగ్ ఊబిలోపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యాప్స్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయి ఆర్థికంగా, మానసికంగా కృంగిపోతున్న యువకులు చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బెట్టింగ్‌యాప్స్ ప్రమోటింగ్‌లో మాజీ మంత్రి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై విచారణ జరపాలన్నారు. కొందరు ప్రమోటర్లకు నోటీసులిచ్చి కేసులు బుక్‌చేస్తే సరిపోదని, డ్రగ్స్ కేసును నీరుగార్చినట్లు కాకుండా పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. ఆస్తి పన్ను వడ్డీ మాఫీపై వెసులుబాటు కల్పించాలన్నారు.
పసుపు, ఎర్రజొన్న రైతులపై
కేసులు ఎత్తివేయాలి
వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలి
అసెంబ్లీలో రూరల్ ఎమ్మెల్యే
డాక్టర్ భూపతిరెడ్డి
పంట నష్టపరిహారం చెల్లించాలి
పంట నష్టపరిహారం చెల్లించాలి