సుభాష్‌నగర్: భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించినప్పుడు అతి తక్కువ సమయంలో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టేందుకు ‘హైపర్’ కార్యచరణ ప్ర ణాళిక రూపొందించామని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) రాపెల్లి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. హైపర్‌ను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి, కార్యచరణను మెరుగుపర్చుకుంటూ గణనీయమైన అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని స్పష్టంచేశారు.
హైపర్ అంటే (haiper)
హెచ్: హెడ్‌క్వార్టర్‌లో అప్రమత్తంగా ఉండటం
ఏ: సిబ్బంది, సామగ్రి సమీకరణ
ఐ: సమాచార సేకరణ, చేరవేయడం
పీ: పటిష్ట వ్యూహాన్ని అమలు చేయడం
ఈ: నిర్ధిష్ట కార్యాచరణ అమలు
ఆర్: విద్యుత్ సరఫరా పునరుద్ధరణ.