నిజామాబాద్ సిటీ: నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న చెత్త సేకరణ, పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ ఎస్ దిలీప్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఖానాపూర్‌లోని చెత్త శుద్ధి కేంద్రాన్ని, నాగారంలోని డంపింగ్‌యార్డును శానిటరీ అధికారులతోకలిసి పర్యవేక్షించారు. బయోవేస్టేజీ విధానాన్ని చూశారు. చెత్తను రీసైక్లింగ్ చేసే ప్రక్రియ నిరంతరం చేపట్టాలని ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్, మున్సిపల్ ఈఈ మురళీమోహన్‌రెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్ సాజిద్, డంపింగ్‌యార్డ్ ఇన్‌చార్జి ప్రభురాజ్ తదితరులు ఉన్నారు.
పోలీస్ కార్యాలయాలను తనిఖీ చేసిన సీపీ
ఖలీల్‌వాడి/ ఎడపల్లి: జిల్లా కేంద్రంలోని పోలీస్ కా ర్యాలయాలను సీపీ సాయిచైతన్య శుక్రవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. భరోసా సెంటర్, షీ టీమ్ కార్యాలయం, పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్, సౌత్ రూరల్ ఆఫీస్‌లను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సీపీ కార్యాలయంలో రికార్డులను తని ఖీ చేశారు. అదేవిధంగా ఎడపల్లి పీఎస్‌ను సీపీ తని ఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీపీ వెంట పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఉన్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
సిరికొండ: మండలంలోని న్యావనందిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రవీణ్, ముత్తెన్న, నరేందర్, జనార్దన్, సాగర్, తేజ, గణేశ్, చందు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనుల తనిఖీ
పారిశుధ్య పనుల తనిఖీ