జమీల్‌ అహ్మద్‌కు అబ్దుల్‌ కలాం నేషనల్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

జమీల్‌ అహ్మద్‌కు అబ్దుల్‌ కలాం నేషనల్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు

Mar 20 2025 2:35 AM | Updated on Mar 20 2025 2:34 AM

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో హిందీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎండీ జమీల్‌ అహ్మద్‌ బోధన, పరిశోధన రంగంలో డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. బెంగుళూరుకు చెందిన ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ సోమవారం అవార్డును అందజేసింది. తెయూ వీసీ ప్రొఫెసర్‌ టీ యాదగిరి రావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం యాదగిరి అవార్డు అందుకున్న జమీల్‌ అహ్మద్‌ను బుధవారం అభినందించారు. కార్యక్రమంలో టూటా అధ్యక్షుడు ఏ పున్నయ్య, ప్రిన్సిపాల్‌ మామిడాల ప్రవీణ్‌, అధ్యాపకులు సత్యనారాయణ రెడ్డి, మహమ్మద్‌ అబ్దుల్‌ ఖవి, మూసా ఖురేషీ, పార్వతి, గుల్‌–ఏ–రాణా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement