● నేటితో ముగియనున్న
ఫస్టియర్ పరీక్షలు
నిజామాబాద్‌అర్బన్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 16,766 మంది విద్యార్థులకు 16,291 మంది హాజరుకాగా, 475 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 57 పరీక్షా కేంద్రాలకు 54 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. కాగా, నేడు (బుధవారం) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగియనుండగా, గురువారం ద్వితీయ సంవత్సర పరీక్షలు పూర్తికానున్నాయి.
చిరుత కోసం గాలింపు
ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలంలోని జానకంపేట, ఠాణాకలాన్, నవీపేట్ మండలంలోని అబ్బాపూర్ అటవీ ప్రాంతాల్లో చి రుత పులి కోసం మూడు బృందాలు గా లింపు చేపట్టాయి. జానకంపేట సీటీసీతో పాటు అటవీ ప్రాంతాల్లో రెండురోజులపాటు పరిశీలించిన అధికారులు చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పంట పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. బృందంలో సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్, బీట్ ఆఫీసర్ ప్రవీణ్, ఫారెస్టు అధికారులు ఉన్నారు.
ఏప్రిల్ 27న మోడల్ స్కూల్ ప్రవేశపరీక్ష
నిజామాబాద్ అర్బన్: మోడల్ స్కూల్ అడ్మిషన్లకు ఏప్రిల్ 27న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశానికి 27న ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, పదో తరగతికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆ సక్తి గల విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
లా సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలను వ ర్సిటీ వైస్ చాన్స్‌లర్ టి యాదగిరి రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీసీ వెంట న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న రాణి, అడిషనల్ కంట్రోలర్ టి సంపత్ ఉన్నారు. పరీక్షలకు 42 మందికి 33 మంది హాజరు కాగా 9 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఎస్‌బీ ఏసీపీకి
ఏఎస్పీగా పదోన్నతి
ఖలీల్‌వాడి: నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాస్ రావు కు అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 15 మంది ఏసీపీలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప దోన్నతి పొందిన ఏసీపీలను డీజీపీ కార్యాల యంలో రిపోర్టు చేయాలని తెలిపారు.
ఇంటర్ ద్వితీయంలో 475 మంది గైర్హాజరు
ఇంటర్ ద్వితీయంలో 475 మంది గైర్హాజరు