రెంజల్: మండలంలోని కందకుర్తి గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్‌జీ మంగళవారం సందర్శించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న స్మృతి మందిరం, స్కందాలయంతో పాటు స్వయంభూ రామ మందిరాన్ని దర్శించారు. నిర్మాణ పనుల గురించి స్థానిక ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. రామాలయం వైభవాన్ని ఆయనకు వివరించారు. కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రం ప్రాశస్తాన్ని వివరించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, బస్వా లక్ష్మీనర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు గోపికృష్ట, మేక సంతోష్, ఈర్లరాజు, ప్రసాద్, రంజిత్ పాల్గొన్నారు.