మోర్తాడ్(బాల్కొండ): మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో పసుపు పంటకు లభిస్తున్న ధరనే నిజామాబాద్ మార్కెట్‌లోనూ అమలయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ మార్కెట్‌లో వ్యాపా రులు సిండికేట్‌గా ఏర్పడడంతో ఎంత నాణ్యత ఉన్నా పసుపు పంటకు ధర లభించడం లేద న్నారు. ఇదే రకం పసుపును రైతులు సాంగ్లీ మార్కెట్‌కు తరలిస్తే క్వింటాలు కు రూ.13వేల నుంచి రూ.14వేల ధర పలుకుతుందని వెల్లడించారు. నిజామాబాద్‌లో మొదట్లో క్వింటాలు పసుపునకు రూ.12వేల ధర లభించగా ప్రస్తుతం రూ.8వేలు మాత్రమే దక్కడంతో రైతులు నష్టపోతున్నారని వాపోయారు. ఇది ఎనిమిది నియోజకవర్గాల రైతుల సమస్య అని ఆయన చెప్పారు.
బాల్కొండ ఎమ్మెల్యే
వేముల ప్రశాంత్‌రెడ్డి