సుభాష్‌నగర్ : ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ సా యుధ పోరాట యోధుడు, ప్రత్యే క తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. తెలుగు యూనివర్సి టీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు మా ర్పుపై అసెంబ్లీలో పెట్టిన తీర్మానంపై సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయా న్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పేరు మార్పు విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. పొట్టి శ్రీరాములు కేవలం భాషాపరమైన ఉద్యమమే కాకుండా దళితుల హక్కుల కోసం, స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీతో కలిసి పనిచేశారని గుర్తుచేశారు. ఆయన పేరు తొలగిస్తే ఆర్యవైశ్య జాతి మొత్తం ఉద్యమానికి సిద్ధంగా ఉందన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ