నిజామాబాద్ అర్బన్ : దివ్యాంగుల సేవను తల్లిదండ్రులు, సహిత విద్యా విభాగం ఉద్యోగులు బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ అన్నారు. దివ్యాంగ విద్యార్థులకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు ఉండడంతోపాటు పదో తరగతి పాస్ మార్కుల విషయంలోనూ ప్రభుత్వం మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీలో సోమవారం దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సహాయ ఉపకరణాలు అందజేస్తున్న ఆలింకోను డీఈవో అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలింకో నిధులు రూ. 23,28,379తో విలువైన పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు. దివ్యాంగ విద్యార్థులకు మంజూరైన స్టైఫండ్, అలవెన్సులు త్వరలోనే బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఐఈఆర్పీలు ప్రకాశ్, లింబాద్రి స్వా మి, సంతోష్, శేఖర్, నాగేశ్ గౌడ్, జలంధర్, కిష న్ సాగర్, ఆనంద్, కిషన్, లక్ష్మణ్, ప్రసాద్ , స్పె షల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి అశోక్