తీసుకునే రుణం వర్తించనున్న సబ్సిడీ
రూ.లక్ష 80 శాతం
రూ. 2 లక్షలు 70 శాతం
రూ.3 లక్షల నుంచి
రూ.4 లక్షల వరకు 60 శాతం
దరఖాస్తు చేసుకునేందుకు
సందర్శించాల్సిన వెబ్‌పోర్టల్
https://tgobmmsnew.cgg.gov.in
నిజామాబాద్ అర్బన్ /మోర్తాడ్(బాల్కొండ): యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉ ద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి దరఖాస్తు ల స్వీకరణ ప్రారంభించింది. డిగ్రీ ఉత్తీర్ణులైన ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు ఈ ఆర్థిక రుణాన్ని అందించనుంది. ప్రభుత్వం అందించే ఈ రుణంతో నిరుద్యోగు లు తమకు నచ్చిన వ్యాపారాన్ని నిర్వహించుకు నే అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి అనంతరం అర్హులను ఎంపిక చేయనున్నారు. అందులో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి 5,000 మందిని ఎంపిక చేసి జూన్ 2న రుణాలు పంపిణీ చేయనున్నారు. పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు మంగళవారం అధికారులు వెల్లడించనున్నట్లు తెలిసింది.
కార్పొరేషన్‌లకు జీవం
ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలను అందించేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కార్పొరేషన్‌లకు రాయితీ కోసం నిధులను కేటాయించకపోవడంతో సబ్సిడీ రుణాలకు బ్రేక్ పడింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక విడతలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితబంధు, బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీబంధు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలను అందించినా పూర్తిస్థాయిలో పథకాలు అమలు కాలేదు. ఫలితంగా ఆయా కార్పొరేషన్లు ఢీలా పడ్డాయి. తాజాగా యువతకు రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకూ రాయితీ రుణాలను అందించేందుకు కొత్త పథకానికి జీవం పోస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కొత్త పథకానికి శ్రీకారం
చుట్టిన సర్కారు
నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి
రూ.4లక్షల వరకు సబ్సిడీ రుణాలు
ఆన్‌లైన్‌లో ప్రారంభమైన
దరఖాస్తుల స్వీకరణ
ఎంపికలో పారదర్శకత లోపించవద్దు
లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో పారదర్శకత లోపించకూడదు. అర్హులైన వారికే ప్రభు త్వ పథకాలు అందించాలి. నిరుద్యోగులు ప్రభు త్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికా ర పార్టీ నాయకుల జోక్యం లేకుండా చూడాలి.
– పుప్పాల నరేశ్,
బీజేపీ మండల అధ్యక్షుడు, మోర్తాడ్
యువతకు మంచి అవకాశం
రాజీవ్ యువ వికాసం పథకంతో యువతకు మంచి అవకాశం కల్పించినట్లు అవుతుంది. గతంలో రాయితీ రుణాలకు మంగళం పలకడంతో అనేక మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి లభించక వలస వెళ్లారు. ఇప్పుడు ఉన్న ఊరిలోనే సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. – తక్కూరి సతీశ్, కాంగ్రెస్ నాయకుడు, మోర్తాడ్
ఉపాధికి ఊతం.. రాజీవ్ యువ వికాసం
ఉపాధికి ఊతం.. రాజీవ్ యువ వికాసం