ఖలీల్‌వాడి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు అందించనున్నట్లు ఆర్‌ఎం జ్యోత్స్న ఒక ప్రకటనలో తెలిపారు.‘శ్రీరామనవమి’ సందర్బంగా ఏప్రిల్ 6న భద్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల వారి కల్యాణంలో వాడిన తలంబ్రాలు, ముత్యాలు రాష్ట్ర ఆర్టీసీ కార్గో సేవా విభాగం ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు ఆర్టీసీ కార్గోలో శుక్రవారం నుంచి రూ.151 చెల్లించి బుక్ చేసుకోవాలన్నారు. వారికి తలంబ్రాలను హోమ్ డెలివరీ ద్వారా అందిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం కింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు.
నిజామాబాద్–1డిపో – 9154298727
నిజామాబాద్–2డిపో – 7396889496
ఆర్‌ఏం ఆఫీసు – 8639969647
ఆర్మూర్ డిపో – 7396889496
బోధన్ డిపో – 9676747174
బాన్సువాడ డిపో – 9154298729
కామారెడ్డి డిపో – 9154298729