
కాలువలో పడి యువకుడి గల్లంతు
బాన్సువాడ రూరల్: మండలంలోని జక్కల్‌దాని తండా సమీపంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు పడిపోయి గల్లంతయ్యాడు. వివరాలు ఇలా.. మండలంలోని సంగ్రాంతండాకు చెందిన బోడ సిద్దు (సిద్దార్థ) అనే 19ఏళ్ల యువకుడు శనివారం మిత్రుడు రాజుతో కలిసి సేవాలాల్ దీక్ష చేపట్టడానికి కావాల్సిన షాపింగ్ కోసం బాన్సువా డ వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్ర మంలో పెద్దపూల్ బ్రిడ్జి వద్ద కాళ్లు చే తులు కడుక్కొవడా నికి ఇరువురు కాలు వలో దిగారు. ప్ర మాదవశాత్తు ఇద్ద రు నీటిలో పడిపో యి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా రాజును స్థానికులు కాపాడారు. సిద్ధు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలిస్తున్నారు.

కాలువలో పడి యువకుడి గల్లంతు