
ఏటీసీలకు అనువైన స్థలాలు గుర్తించాలి
నిజామాబాద్‌అర్బన్ : యువతలో వృత్తి నైపు ణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ నియోజకవర్గాల్లో నూతనంగా అడ్వాన్స్‌డ్ టెక్నా లజీ సెంటర్లను (ఏటీసీ)ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో గురువారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో 70 ఏటీసీల నిర్మాణాలు వివిధ దశ ల్లో కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. ఇదే తర హాలో ఐటీఐ, ఏటీసీలు లేని ప్రతి గ్రామీణ ప్రాంత అసెంబ్లీ సెగ్మెంట్‌లో కనీసం ఒకటి చొప్పున ఏర్పా టు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏటీసీల నిర్మాణానికి అనువైన ప్రదేశం, స్థలాన్ని గుర్తిస్తూ సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. రోడ్డు, రవాణా వసతితోపాటు సమీపంలో పరిశ్రమలు ఉన్న స్థలాలను ఎంపిక చేస్తే ఏటీసీల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి, ఇన్‌స్ట్రక్టర్లు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని సూచించారు. శిక్షణ పూర్తి చే సుకున్న వెంటనే యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉ పాధి అవకాశాలు లభించేందుకు దోహదపడినట్లు అవుతుందన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలోని ఆర్మూర్, నిజామాబా ద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏటీసీల ఏ ర్పాటుకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి నివేదికను సోమవారంలోపు పంపిస్తామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత, విత్తనశుద్ధి పరిశ్రమలకు అనుగుణంగా ఏటీసీల్లో కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జూమ్ మీటింగ్‌లో సంబంధిత శాఖల అధికారులు, ఐటీఐ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
గ్రామీణ నియోజకవర్గాల్లోనే
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు
రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్
కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష