
సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం
నిజామాబాద్ సిటీ: విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ నారాయణ అన్నారు. జిల్లాకేంద్రంలోని పవర్‌హౌస్‌లో గురువారం విద్యు త్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వినియోగదారు ల నుంచి చైర్మన్ నారాయణ సమస్యలపై దరఖాస్తు లు స్వీకరించారు. విద్యుత్‌శాఖ సిబ్బంది రామకృష్ణ, కిషన్, రాజారెడ్డి, శ్రీనివాస్, చంద్రశేఖర్, మంగ్త్య నాయక్, నగేష్, రావూఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల్లో హుండీ లెక్కింపు
నిజామాబాద్ రూరల్: శ్రీ బడా రాంమఠ్ ఆలయంలో గురువారం దేవాదాయ ధర్మాదా య శాఖ ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. మొత్తం రూ.89,320 ఆదా యం వచ్చింది. నగరంలోని శంభులింగేశ్వరస్వామి దేవస్థా నంలో హుండీ లెక్కించగా రూ.1,09,815 ఆదా యం వచ్చింది. శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి రా ములు, శాఖ పరిశీలకులు కమల, శ్రీ బడారాంమఠ్ ఫిట్‌మాన్ వేణు, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ కుమార్ ఉన్నారు.

సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం