వేల్పూర్: వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడలో లుకేమియా అనే క్యాన్సర్ వ్యాధి సోకిన విద్యార్థి నిఖిలేశ్ చికిత్సకు సాయం చేయాలని ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని యాష్ టాగ్ తెలంగాణ సీఎంవో అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి తన వ్యక్తిగత ఎక్స్ లో బుధవారం పోస్ట్ చేశారు. చిరుప్రాయంలోనే ప్రాణాంతక వ్యాధి అనే శీర్షికన నిఖిలేశ్‌కు సోకిన క్యాన్సర్ వ్యాధిపై ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీనిని చూసిన ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డి దయచేసి చికిత్సకు సహాయం చేయాలంటు ఎక్స్‌లో విన్నవించారు.
● చికిత్సకు సాయం చేయాలని
సీఎంకు విన్నవించిన ఆర్మూర్ ఎమ్మెల్యే