మూడు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లకు నిధులు | - | Sakshi
Sakshi News home page

మూడు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లకు నిధులు

Mar 10 2025 10:17 AM | Updated on Mar 10 2025 10:15 AM

ఒక్కోదానికి రూ.200 కోట్లు..

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

బోధన్‌/ నిజామాబాద్‌ అర్బన్‌ : జిల్లాకు మూడు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ గురుకుల పాఠశాలలకు నిధులు కేటాయిస్తూ రా ష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యా ప్తంగా 55 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు మంజూరు చేయగా, అందులో బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూర ల్‌ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణానికి రూ. 200 కోట్ల చొప్పున పరిపాలన అనుమ తు లు మంజూరు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.

నేడు బాధ్యతలు

స్వీకరించనున్న సీపీ

ఖలీల్‌వాడి : నిజామాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా పోతరాజు సాయి చైతన్య సోమవా రం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. హైదరా బాద్‌ నార్కోటిక్‌ విభాగంలో ఎస్పీగా విధు లు నిర్వర్తిస్తున్న ఆయనను ప్రభుత్వం నిజామాబాద్‌ సీపీగా నియమించిన విషయం తెలిసిందే. కాగా, సాయిచైతన్య ఆదివారం నార్కోటిక్‌ విభాగంలో రిలీవ్‌ అయినట్లు సమాచారం. నూతన సీపీ బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేసినట్లు తెలిసింది.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు

దినేశ్‌ కులాచారి

ధర్పల్లి: నీళ్లు లేక వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి అన్నారు. ధర్పల్లి, దుబ్బాక గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దినేశ్‌ మాట్లాడుతూ.. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి నీళ్లు లేక ఎండిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. రూరల్‌ నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఎమ్మెల్యే భూపతిరెడ్డి పట్టించుకోవడంలేదని విమర్శించారు. మంచిప్ప రిజర్వాయర్‌ పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరందించాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పంట నష్టపరిహారం కోసం కలెక్టర్‌కు లేఖ రాస్తాన ని అన్నారు. బీజేపీ తరఫున అందుబాటులో ఉంచనున్న నీళ్ల ట్యాంకర్లను రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్‌ యాదవ్‌, నాయకులు గంగాదాస్‌, కర్క గంగారెడ్డి, మహేశ్‌, సదానందగౌడ్‌, అమృనాయక్‌, నరేశ్‌గౌడ్‌, రాము, మల్లయ్య, సుమన్‌, తిరుపతి తదితరులు ఉన్నారు.

‘మీటర్‌’ మోసాలపై

అప్రమత్తంగా ఉండాలి

సుభాష్‌నగర్‌: విద్యుత్‌ మీటర్లలో రీడింగ్‌ త క్కువ అయ్యేలా చేస్తామంటూ వస్తున్న వ్య క్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీటీఎస్‌ సీఐ బి గోవర్ధన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొందరు వ్యక్తు లు తక్కువ కరెంటు బిల్లు వచ్చేలా చేస్తామంటూ డబ్బులు తీసుకొని విద్యుత్‌ మీటర్‌లోని తీగలను కట్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. మీటర్‌లోని తీగలను కట్‌ చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తామని, మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్‌ మీ టర్‌ తిరగకుండా చేస్తామని ఎవరైనా వస్తే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

శ్రీవారికి చక్ర స్నానం

తెలంగాణ తిరుమలలో

ముగిసిన బ్రహ్మోత్సవాలు

బాన్సువాడ : బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివా రం శ్రీవారికి చక్ర స్నానం చేయించారు. అంతకుముందు వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీ వారి విగ్రహానికి పంచామృతాభిషేకం చేసి, ఆలయంలో ఉన్న పుష్కరిణిలో వేదపండితులు చక్రస్నానం చేయించారు. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు, నేతలు పోచారం శంభురెడ్డి, పోచారం సు రేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement