జిల్లాకు ఎంపీ అర్వింద్‌ తెచ్చిన నిధులు ఎన్ని? | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు ఎంపీ అర్వింద్‌ తెచ్చిన నిధులు ఎన్ని?

Mar 10 2025 10:14 AM | Updated on Mar 10 2025 10:14 AM

జిల్లాకు ఎంపీ అర్వింద్‌ తెచ్చిన నిధులు ఎన్ని?

జిల్లాకు ఎంపీ అర్వింద్‌ తెచ్చిన నిధులు ఎన్ని?

నిజామాబాద్‌ సిటీ: రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన అర్వింద్‌ జిల్లాకు ఎన్ని నిధులు తెచ్చారని, ఏయే పనులు చేపట్టారో తెలపాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ఆదివారం నుడా చైర్మన్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కేశవేణు మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్‌ మతిభ్రమించి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఇష్టారీతిన మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డిని విమర్శించే స్థాయి అర్వింద్‌కు లేదన్నారు. తాహెర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో జిల్లా విద్యా శాఖ అధికారులు ఆలోచిస్తారన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మన్‌ అంతిరెడ్డి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలను తప్పుదోవ పట్టించడానికే..

నిజామాబాద్‌ సిటీ: కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి ఎంపీ అరవింద్‌ అబద్ధపు వాదనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి యత్నిస్తున్నాడని రాష్ట్ర సహకార యూనియన్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం మాటలతో పబ్బం గడపడం అర్వింద్‌కు అలవాటే అని అన్నారు. నిజంగా ఎంపీ అర్వింద్‌కు నవోదయ సమస్య పరిష్కారం కావాలంటే బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో మాట్లాడితే బాగుండేదన్నారు. జిల్లా అభివృద్ధిలో సుదర్శన్‌ రెడ్డికి పోటీ ఎవరూ లేరన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement