ఆగస్ట్‌ 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ | Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌ 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ

Published Wed, Apr 17 2024 1:15 AM

యానంపల్లి కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి    - Sakshi

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగస్ట్‌ 15 లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని తమ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. మంగళవారం డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ధాన్యం సేకరణ తీరును పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. హ మాలీలకు ఇస్తున్న కూలి, గన్నీ సంచులు, ధాన్యం సేకరణ, లారీల్లో రైస్‌మిల్లులకు తరలింపు వివరా లను సొసైటీ చైర్మన్‌ రాంచందర్‌గౌడ్‌, సీఈవో కిషన్‌లు ఎమ్మెల్యేకు వివరించారు. రైతులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులున్నాయా అని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంద న్నారు. వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు లు వేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభు త్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.1,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయన్నారు. ప్రస్తుతం రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేదని, ఏమైనా ఫి ర్యాదులుంటే టోల్‌ఫ్రీ నెంబరుకు సమాచారం ఇవ్వవచ్చన్నారు. వచ్చే సీజన్‌ నుంచి రూ.500 బోనస్‌ చెల్లిస్తామన్నారు. రైతు భరోసా 5 ఎకరాలకే పరిమితం చేశామని, సాగు చేసే రైతులు, కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నా రు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్వీ అల్కలైన్‌ మినరల్‌ వాటర్‌ ప్లాంటును ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి సొసైటీ ఛైర్మన్‌ రాంచందర్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ గంగారాం, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్‌, కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ షాదుల్లా, న్యాస రాజేశ్వర్‌, పులి వెంకటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి

Advertisement
 
Advertisement