
మాట్లాడుతున్న పీఎంపీ అసోసియేషన్ సభ్యులు
నిజామాబాద్‌నాగారం: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న పీఎంపీలపై ప్రభుత్వం దాడులను వెంటనే ఆపాలని పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రాజు తెలిపారు. నగరంలో సంఘ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీ సభ్యుల సేవలు వెలకట్టలేనివన్నారు. ఐఎంఏ సభ్యులు ఆరోపణలు చేయడం వల్లే రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధికారులు పీఎంపీ సభ్యులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒకరు ఇద్దరు చేసిన తప్పులకు వ్యవస్థని తప్పుపట్టడం సరికాదన్నారు. దీనిపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేయడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సంఘ ప్రతినిధులు సత్యపాల్, రాష్ట్ర కోశాధికారి సాంబశివరావు, భోజన పాల్గొన్నారు.