
ఆర్మూర్: కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పట్టణంలోని సప్తగిరి ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ అస్తిత్వాన్ని కాపాడడంలో భాగంగా ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలులోకి తీసుకువచ్చే రోజులు రానున్నాయని చెప్పారు. కు లాలు, మతాల పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాజ కీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం తెలంగాణలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. బీఆర్‌ఎస్ చచ్చిన పాము అని, కాంగ్రెస్ మునిగిపోయే పడవ అన్నారు. మోదీ దేశ ప్రజల అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తుంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వారి వారసత్య రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మోదీ ఆ ధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అడగాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.అంతకుముందు బీజేపీ ఎంపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజే పీ మాత్రమే మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని ప్రజలకు నమ్మకం ఉందన్నారు. బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరా రు. సమావేశంలో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిర్మల్ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, మహేశ్వర్‌రెడ్డి, నాయకులు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కులాలు, మతాల పేరుతో కాంగ్రెస్,
బీఆర్‌ఎస్ రాజకీయాలు
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్