
బోధన్‌లో మాట్లాడుతున్న మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మాశరత్‌రెడ్డి
బోధన్‌టౌన్(బోధన్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలను త్వరలో రాష్ట్రంలో అమలు చేస్తామని బోధన్ మున్సి పల్ చైర్‌పర్సన్ తూము పద్మాశరత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో ఆదివారం ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఆమె అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ప్ర భుత్వం ఏర్పడిన రెండు, మూడు రోజుల్లో అమలు చేయడం గర్వకారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆర్డీవో రాజాగౌడ్, వైద్యాధికారిణి సమత, కౌన్సిలర్లు తూము శరత్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, సత్యం నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.