
హుస్నాబాద్ కాలనీలోని రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారం
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని పలు వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పారిశుధ్యం అధ్వానంగా మారింది. వీధుల్లోని చెత్తకుప్పలను పారిశుధ్య సిబ్బంది తరలించాల్సి ఉండగా, అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడిక్కడే చెత్తకుప్పలు పేరుకుపోయాయి. దీంతో పరిసరాల్లో దుర్గంధం వెదజల్లడంతోపాటు దోమలు వృద్ధి చెందుతున్నా యి. ప్రజలు చెత్తను ఆరుబయట వేయకుండా అధికారుల అవగాహన కల్పించడంలో విఫలమయ్యా రు. అలాగే చెత్తడబ్బాలు ఏర్పాటుచేసినప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో వృథాగా మారాయి. దీంతో స్థానికులు చెత్తను రోడ్లపై వేయడంతో కోతులు, పందులు, కుక్కలు చెల్లాచెదురుగా చేస్తున్నాయి. దీంతో కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచకుంటే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలనీల్లో చెత్తను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని వీధుల్లో
పేరుకుపోతున్న చెత్తాచెదారం
పట్టించుకోని అధికారులు