
డిచ్‌పల్లిలో ప్రభుత్వ పథకాల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్ రూరల్: సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో సామాజిక న్యాయం పాటిస్తామని, అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆదివారం ఆయన మొదటిసారి డిచ్‌పల్లి మండలకేంద్రానికి విచ్చేశారు. ఈసందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను డిచ్‌పల్లిలో ప్రారంభించారు. అనంతరం అమృత గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భూపతిరెడ్డి పాల్గొని, మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించడానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామన్నారు. పార్టీ కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. పార్టీ నాయకులు తాహెర్‌బిన్ హందాన్, ముప్ప గంగారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, అమృతాపూర్ గంగాధర్, గోపాలం విద్యాసాగర్, పోల సాని శ్రీనివాస్, మునిపల్లి సాయిరెడ్డి, కంచెట్టి గంగాధర్, గడీల రాములు, వాసుబాబు, నవీన్ గౌడ్, ముప్ప గంగారెడ్డి, ఇమ్మడి గోపి, రాజేశ్వర్, షాదు ల్లా, ధర్మాగౌడ్, సాయేందర్, శాంసన్ ఉన్నారు.
ఘన స్వాగతం..
ఇందల్వాయి: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే భూ పతి రెడ్డికి ఆదివారం ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అ భిమానులు గజమాలతో సన్మానించి ఘన స్వాగ తం పలికారు. అంతకుముందు చంద్రాయన్‌పల్లి వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులు అర్పించారు. నాయకులు నవీన్ గౌడ్, మునిపల్లి సాయిరెడ్డి, ఇమ్మడి గోపీ ముదిరాజ్, వెంకట్ రెడ్డి, సంతోష్ రెడ్డి, కర్సం మోహన్, సుధాకర్, ఆశిష్, ఒడ్డె రాజు, ఎల్‌ఐసీ గంగాధర్ ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన నాయకులు
ధర్పల్లి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదివారం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా ధర్పల్లి కాంగ్రెస్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. భూపతిరెడ్డికి పుష్పగుచ్ఛాన్ని అందించి, శాలువాతో సన్మానించారు. మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, నాయకులు మనోహర్‌రెడ్డి, చెలిమెల నర్సయ్య, కష్ణ, గంగారెడ్డి, శ్రీనివాస్ ,శ్రీధర్ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే
డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి
డిచ్‌పల్లిలో ‘మహాలక్ష్మి’,
ఆరోగ్యశ్రీ పథకాల ప్రారంభం

