
సుభాష్‌నగర్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హ నుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రస్తుతం యథావిధిగా ప్రతి సోమవారం కొనసాగిస్తామన్నారు. ప్రజావా ణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చే సుకోవాలని కలెక్టర్ సూచించారు.
364 మందికి
ఐపీ నోటీసులు
● డిచ్‌పల్లిలో వ్యాపారి కుచ్చుటోపి
● రూ. 15 కోట్లకు ఎసరు
నిజామాబాద్ రూరల్ : డిచ్‌పల్లి మండల కేంద్రంలోని విత్తనాల దుకాణం, సిమెంట్ దందా చేసే వ్యాపారి రూ.15 కోట్లకు ఐపీ పెట్టాడు. వ్యాపారంలో నష్టపోయి ఐపీ పెట్టినట్లు సమాచారం. వ్యాపారి డిచ్‌పల్లిలో కొ న్నేళ్లుగా వివిధ వ్యాపారాలు చేస్తుండటంతో ఆయనను నమ్మిన కొంతమంది డబ్బులు ఇ చ్చారు. కాగా సదరు వ్యాపారి ఐపీ పెట్టడంతో సుమారు 364 మంది నోటీసులు అందుకున్నట్లు తెలిసింది. ఇందులో ఎక్కువ మంది రైతులు ఉండటం గమనార్హం. పంటలు పండించిన డబ్బులను వ్యాపారిని నమ్మి ఇ స్తే ఐపీ పెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరు రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు అప్పులు ఇచ్చారు. డ బ్బులు ఇవ్వకుండా వ్యాపారి ఐపీ పెట్టడంతో బాధితులు బోరుమన్నారు. వ్యాపారి కుమారుడు ఇంజినీర్ చదివి బిల్డర్‌గా అవతారమెత్తాడు. స్థానిక మండలకేంద్రంలో ఓ కల్యాణ మండపాన్ని అద్దెకు తీసుకుని నడుపుతున్నట్లు సమాచారం. రూ. కోట్ల ఆస్తులు ఉన్న వ్యాపారి రూ. 15 కోట్లకు ఐపీ పెట్టడంతో ఏం జరుగుతుందోనని మండలవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నోటీసులు అందుకు న్న వారిలో సదురు వ్యాపారి బంధువులు కూడా ఉన్నారు. బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.
ప్రశాంతంగా
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
నిజామాబాద్ అర్బన్ : నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యా ప్తంగా 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. 1,518 మంది విద్యార్థులకు గాను 1,458 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు.
సీఆర్పీల ఆడిట్ కమిటీ
చైర్మన్‌గా సత్యనారాయణ
కామారెడ్డి టౌన్ : తెలంగాణ రాష్ట్ర సీఆర్పీల సంఘం ఆర్థిక పరిపాలన ఆడిట్ కమిటీ చైర్మన్‌గా లింగంపేట మండలానికి చెందిన సత్యనారాయణ ఎన్నికయ్యా రు. ఆదివారం కామారెడ్డిలో జరిగిన రాష్ట్ర కా ర్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.
రాజన్న సన్నిధిలో రూరల్ ఎమ్మెల్యే
వేములవాడ : వేములవాడ రాజన్నను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా ఆయన రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు.
డబుల్ ఇళ్లలోకి ప్రజలు..?
నిజామాబాద్ నాగారం : నగరంలోని నాగా రం శివారులోని డబుల్ బెడ్ రూం సము దాయాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించింది. కాని లబ్ధిదారులకు అందించలేదు. అక స్మాత్తుగా ఆదివారం రాత్రి కొంత మంది వ్య క్తులు ఆ డబుల్ బెడ్‌రూం ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి వెళ్లినట్లు సమాచారం.

