
కామారెడ్డి రూరల్: మున్సిపల్ పరిధిలోని సరంపల్లి గ్రామానికి చెందిన గైనబోయిన అంజయ్య అ దృశ్యమైనట్లు కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 19న ఇంటి నుంచి వెళ్లి అంజ య్య తిరిగి రాలేదన్నారు. పలు చోట్ల వెతికినా ఫలితం లేదన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అంజయ్య భార్య సావిత్రి తెలిపారు.
గుర్తు తెలియని బైక్ లభ్యం
వేల్పూర్: వేల్పూర్ అడ్రస్‌పై ఉన్న పల్సర్‌బైక్ డిచ్‌పల్లి పోలీసులకు దొరికిందని ఎవరికై నా ఆచూకీ తెలిస్తే తెలపాలని వేల్పూర్ ఎస్సై వినయ్‌కుమార్ ఆదివారం తెలిపారు. బైక్ వేల్పూర్ అడ్రస్‌పై ఉ న్నప్పటికీ ఆ అడ్రస్‌లో ఉన్న వ్యక్తు లు వేల్పూర్‌లో లేరని పేర్కొన్నారు. మండలంలో ఈ బైక్‌కు సంబంధించిన వ్యక్తులు ఉంటే 8712659862 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు.
వేల్పూర్ వీడీసీకి నోటీసులు..!
ఖలీల్‌వాడి: వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఓ భూమిలో మట్టి కుప్పలు తీయాలని చెప్పినా వినకపోవడంతో గ్రామంలోని ఓ సంఘం సభ్యులను వీడీసీ బహిష్కరించింది. దీంతో పోలీసులు వీడీసీకి నోటీసులు అందించినట్లు తెలిసింది. గ్రామంలో చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని, న్యాయస్థానాన్ని ఆశ్రయించి సమస్యను పరిష్కారించుకోవాలని నోటీసులో సూచించారు.