
మోర్తాడ్: పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సంసిద్ధతను వ్యక్తం చేసినా ప్రభుత్వం అంగీకారం తెలిపితే స్థానిక నగార మోగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిబ్ర వరి1కి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యు ల పదవి కాలం ముగియనుంది. పాలకవర్గాల పద వి కాలం ముగియక ముందే ఎన్నికలు నిర్వహించా లని గతంలో హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని ఎన్నికల సంఘానికి కోర్టు గతంలోనే సూచించింది. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నిక ల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తును ప్రా రంభించింది. ఓటర్ల సంఖ్య ఆధారంగా ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి వారి వివరాలను అందించాలని ఎన్నికల సంఘం పంచాయతీ అధికారులను ఆదేశించింది. ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలతో పంచాయతీ ఎన్నిక లు జరుగనున్నాయని గ్రామాల్లో విస్తృతమైన ప్రచా రం జరిగింది. పోటీకి ఉత్సాహం చూపుతున్న నా యకులు ఎవరికి వారే తమ మద్దతుదారులతో సంప్రదింపులను షురూ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా స్థానిక ఎన్నికల నిర్వహణకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఆసక్తి చూపుతుందా లేదా అనే సందేహం వ్యక్తం అవుతుంది. సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం, అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కావడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్యలు తీసుకోవడం పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ పెద్దలు బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీల ఎన్నికలు నిర్వహిస్తారో వేచి చూడాల్సిందే.నిజామాబాద్‌లో 530, కామారెడ్డిలో 526 జీపీలు ఉన్నాయి. అన్ని పంచాయతీల పదవి కాలం ముగిసిపోనుండగా షెడ్యూల్ ప్రకారం జనవరిలో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. సమయానుకూలంగా ఎన్నికలను నిర్వహించడానికి ప్రభు త్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఫిబ్రవరి 1కి ముగియనున్న సర్పంచుల పదవి కాలం