
మాట్లాడుతున్న కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
సుభాష్‌నగర్ : పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల కమిషన్ పాసులు కలిగి ఉన్న వారిని మినహాయించి, ఇతర వ్యక్తులను అనుమతించకూడదని రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ అజయ్ వి నాయక్, రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సమీక్షించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్‌తో పాటు జిల్లాలోని ఆయా నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు గౌతమ్ సింగ్, సుబ్రా చక్రవర్తి, లలిత్ నారాయణ్ సింగ్ సందు, పోలీస్ అబ్జర్వర్ రుతురాజ్‌లతో భేటీ అయ్యారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ రాష్ట్ర పరిశీలకులకు వివరించారు. మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాలోకి అనుమతించవద్దని, ఓటర్లను ఏజెంట్లు ఒత్తిడి చేయకుండా నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల బందోబస్తులో అత్యుత్సాహం వద్దని, నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు. అర్బన్ నియోజకవర్గంలో 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, ర్యాండమైజేషన్ కూడా పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర పరిశీలకులు ఆరా తీశారు. కాగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చే యాలని రాష్ట్ర పరిశీలకులు సీపీ కల్మేశ్వర్‌కు సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, చి త్రామిశ్రా, నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు, అదనపు డీసీపీ జయరాం, రిటర్నింగ్ అధికారు లు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో నిబంధనలు
పాటించాలి
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి
ఏర్పాట్లను సమీక్షించిన
రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు