
మాట్లాడుతున్న కృపాల్‌సింగ్
ఖలీల్‌వాడి: టీచర్ల బదిలీలో తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్‌సింగ్ అన్నారు. బడారాంమందిర్‌లో పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించగా జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో యూనియన్ ముందుందన్నారు. ప్రస్తుత ఎన్నికలు జరిగిన వెంటనే బదిలీలో వెళ్లిన టీచర్లలను రిలీవ్ చేసి ఎస్‌జీటీలకు, లాంగ్వేజ్ పండితులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్, నాయకులు ఉన్నారు.
జిల్లా కార్యవర్గం ఎన్నిక
పీఆర్‌టీయూ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నికల పరిశీలకుడు ముత్తారం నరసింహ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా కృపాల్ సింగ్ సోడి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కనకపురం రవీందర్, జిల్లా ఉపాధ్యక్షడిగా దేవానంద్, జిల్లా ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా సుచిత్ర, జిల్లా కార్యదర్శిగా దినేశ్, సలహాదారులుగా వినోద్, గంగాధర్, ధనలక్ష్మి, సందీప్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా నీరుగొండబుచ్చన్న, పొట్లూరి నాగేశ్వర్‌రావు, మహిళా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలిగా హజారి మనోజ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నల్లోల గంగాధర్, జయకృష్ణ, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సావిత్రి బాయి, రాష్ట్ర కార్యదర్శులుగా జావీద్, శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.