నిజామాబాద్‌నాగారం: ‘నిజామాబాద్ సభలో సీ ఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, ప్రధాని పచ్చి అబద్ధాల కోరని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఈమేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తి స్వా ర్థ రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడడం అత్యంత హేయనీయమన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్ప డం పచ్చి అబద్దమని, ఎన్డీయేలో కలవమని మీరు బ్రతిమిలాడితే దేశాన్ని అమ్మే వారితో కలవమని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారన్నారు. నిజామాబాద్‌లో హెలికాప్టర్ దిగిన మోదీకి, కేసీఆర్ కట్టిన కలెక్టరేట్, కేటీఆర్ కట్టిన ఐటీ టవర్ చూసి కన్నుకుట్టి కహానీలు చెప్పిండన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలంటే ప్రధాని సాయం ఎందుకు అన్ని ప్రశ్నించారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గెలుపు ఆపలేరని స్పష్టం చేశారు.
● కేసీఆర్‌పై పీఎం వ్యాఖ్యలు సరికావు
● రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి
ప్రశాంత్‌రెడ్డి