
కిషన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ధన్‌పాల్
ఇందల్వాయి/సుభాష్‌నగర్: నిజామాబాద్‌లో జరిగే జిల్లా పదాధికారుల సమావేశానికి, జిల్లాలో మోదీ పర్యటన పనులను పరిశీలించడానికి మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో పార్టీ నేత ధన్‌పాల్ సూర్యనారాయణ స్వాగతం పలికారు. నగరంలోని బస్వాగార్డెన్‌లో అర్బన్ నియోజకవర్గ నాయకులు కిషన్‌రెడ్డికి భగవద్గీతను అందజేసి, గజమాలతో సన్మానించారు. నాయకులు యెండల లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్, యెండల సుధాకర్, శ్రీనివాస్ శర్మ, భరత్ భూషణ్, వెంకటేష్, బద్ధం కిషన్, రవి, ఎండీ రషీద్ పాల్గొన్నారు.