
డిచ్‌పల్లి/జక్రాన్‌పల్లి/ఇందల్వాయి/మోపాల్(నిజామాబాద్‌రూరల్): రాష్ట్రంలోని అన్ని కులాలు, వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నగరంలోని తన నివాసంలో, రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాజిరెడ్డిగోవర్ధన్ మంగళవారం డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి, మోపాల్ మండలాలకు చెందిన పలు కులసంఘాలు, మహిళా సంఘాలకు మంజూరైన రూ.44.50 లక్షలు నిధుల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.48కోట్లు ఎస్‌డీఎఫ్, సీడీపీ నిధులతో కమ్యూనిటీ హాల్స్, మహిళా సంఘాల భవనాలు, విద్యుత్‌స్తంబాలు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మించినట్లు తెలిపారు. అలాగే పలు గ్రామాల్లో రూ.25కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు నిర్మించామన్నారు. ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ నాయకులు, కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక..
డిచ్‌పల్లి మండలం గొల్లపల్లి, నిజామాబాద్ రూరల్ మండలం జలాల్‌పూర్ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కు చెందిన సుమారు 60 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాభి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
వివిధ గ్రామాల సంఘాలకు అభివృద్ధి పనుల నిధుల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ