
నగరంలో ఐలమ్మ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న అదనపు డీసీపీ జయరావ్, సిబ్బంది
సాక్షి నెట్‌వర్క్: నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో మంగళవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాకేంద్రంతోపాటు వివిధ మండలాలు, గ్రామాల్లో ఐలమ్మ విగ్రహం, చిత్రపటాలకు రజక సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలు ప్రజాసంఘాల నేతలు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అలాగే పలు గ్రామాల్లో నూతనంగా ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.