
తాళ్లరామడుగులో అన్నదానం నిర్వహిస్తున్న గణేశ్ మండలి నిర్వాహకులు.. మైలారంలో..
సాక్షి నెట్‌వర్క్: నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం ఆయా మండలాలు, గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానాలు ఏర్పాటు చేశారు. పలు మండలాల్లో వినాయకులను శోభాయాత్రగా తీసుకువెళ్లి, స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. నగరంలో ఈ నెల 28న వినాయక శోభాయాత్ర కోసం రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని గణేష్ మండలి వద్ద సీపీ సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదనపు డీసీపీలు జయరామ్, గిరిరాజు, హోమ్ గార్డు ఏసీపీ అరుణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, రిజర్వు సీఐ వెంకటప్పలనాయుడు, శ్రీపాల్, తిరుపతి, వెంకట్, శ్రీహరి, ఆర్‌ఎస్సైలు, పాల్గొన్నారు.


డిచ్‌పల్లిలోని సాక్షి కార్యాలయంలో గణేశ్ లడ్డు వేలం విజేతకు లడ్డు అందజేస్తున్న బీఎం